ఆ స‌భ‌లో వాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులే: మంత్రి అడ్లూరి

క‌లం, వెబ్ డెస్క్‌: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో స‌రూర్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన యువ సంగ్రామ స‌ద‌స్సుపై మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ (Minister Adluri Laxman kumar) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ (KTR) నిరుద్యోగ పేరుతో స‌భ పెట్టి పెయిడ్ ఆర్టిస్టుల‌తో మాట్లాడించార‌ని విమ‌ర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిది ప్ర‌జాపాల‌న అయితే, కేసీఆర్‌ది పేప‌ర్ లీకుల పాల‌న అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ హ‌యాంలో కేటీఆర్ జిరాక్స్ సెంట‌ర్‌ల‌లో పోటీ ప‌రీక్ష‌ల ప్ర‌శ్నా ప‌త్రాలు అమ్ముకున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 67,700 ఉద్యోగాలు ఇచ్చామ‌ని మంత్రి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువతను కేసీఆర్ కుటుంబమంతా రెచ్చ‌గొట్టింద‌న్నారు. చివ‌రకు త‌మ తొమ్మిదేళ్ల పాల‌న ఫ‌లితంగా ఉస్మానియా యూనివ‌ర్సిటీ గ‌డ్డ‌పై అడుగు పెట్ట‌లేని దుస్థితి తీసుకొచ్చుకున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డానికి లేనిపోనివి సృష్టించి ఆరోప‌ణ‌లు చేస్తున్న కేటీఆర్‌కు, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>