epaper
Wednesday, February 18, 2026
epaper

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హవా..

కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో (Municipal Elections) ఇప్పటికే చిట్యాల, నందికొండ, చండూరు, హాలియా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన మున్సిపాలిటీల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను.. కాంగ్రెస్ 11 గెలుచుకోగా, బీఆర్ఎస్ ఒకటి మాత్రమే గెలిచింది. నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 11 వార్డులను కాంగ్రెస్, ఒక వార్డును బీఆర్ ఎస్ గెలిచింది. చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 స్థానాలకు గాను కాంగ్రెస్ 9 గెలుచుకోగా, బీఆర్ఎస్ రెండు, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను కాంగ్రెస్ 6 గెలవగా.. బిఆర్ఎస్ 3, సిపిఐ ఒక వార్డును గెలుచుకున్నాయి. చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ సుధాకర్ అలియాస్ అశ్వినీ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>