కుక్కర్ గిన్నెలు వెనక్కి అడిగిన అభ్యర్థి గెలిచారు

కలం,ఖమ్మం బ్యూరో: కుక్కర్ గిన్నెలు వెనక్కి అడిగి తీసుకొని వార్తలలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనూహ్యంగా విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట (Ashwaraopeta Ward 10) మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి పోటీ చేసిన మిండ హరిబాబు గెలిచి మళ్లీ చర్చనీయాంశంగా మారారు. నిన్న గెలవను అనే అనుమానంతో కుక్కర్ గిన్నెలు వెనక్కి ఇవ్వాలని అడగటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇదే విషయమై హరిబాబు మాట్లాడుతూ.. కావాలని నన్ను బద్నాం చేయడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>