కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhusudhan Controversy) అసెంబ్లీ స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తాతా మధు వ్యాఖ్యలను ఖండిస్తూ స్పీకర్ ను పరామర్శించారు. తాత మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ఇదే విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్సీలు కలిశారు. దళిత స్పీకర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తాత మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాతా మధును తక్షణమే ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలన్నారు. తాతా మధును పార్టీ నుంచి కేసీఆర్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

