కలం, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం నూతన సవరణల పేరుతో రాష్ట్రంలోని ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోందని టీఆర్‌ఎస్ అధినేత కవిత (TRS Chief Kavitha) మండిపడ్డారు. హనుమకొండ (Hanumkonda) లో నిర్వహించిన సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కవిత కోరారు.

