Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం మార్కెట్‌కు సమ్మర్ బ్రేక్.. కార్మికుల వినతితోనే!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పేరు గాంచిన ఖమ్మం (Khammam) వ్యవసాయ మార్కెట్‌కు సమ్మర్ హీట్ తగులుతోంది. కార్మిక సంఘాల వినతి మేరకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి జూన్ 5 వరకు మార్కెట్ కమిటీ సెలవులు ప్రకటించింది. మార్కెట్‌లో నిత్యం వేల సంఖ్యలో హమాలీలు, ఇతర కార్మికులు ఎండలో పని చేస్తుంటారు. తీవ్రమైన ఎండ, వడగాలుల కారణంగా కార్మికుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండటంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ​వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినా… దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వ్యాపార వర్గాలు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలపడం విశేషం. జూన్ రెండో వారం నుంచి మార్కెట్ మళ్లీ కళకళలాడనుంది.

నిల్వ సదుపాయం లేకపోయినా..

మార్కెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు, తమ వద్ద ఉన్న పంటను జూన్ 6 వరకూ మార్కెట్‌కు తీసుకొచ్చే అవకాశం లేదు. అయితే, పంట నిల్వ చేసుకునే సదుపాయం లేని రైతులు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వేడి నుంచి కూలీలను రక్షించుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమైనదే అయినా.. ఈ విరామం వల్ల మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు రాకుండా, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>