కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుల స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాకాల రాంచందర్ (Pakala Ramchander) కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గూటికి చేరారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలు, దేశ అభివృద్ధి కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యం రెడ్డి, మాజీ కౌన్సిలర్ అకోజీ కిషన్, రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : పరువు తీస్తారా?.. రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్
Follow Us On: Youtube

