కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిజామాబాద్లో మహా పాదయాత్ర (BJP Maha Padayatra), సభ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ తెలిపారు. గాంధీ చౌక్ నుంచి ఆర్.ఆర్. చౌరస్తా వరకు ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శనివారం ఉదయం 10 గంటలకు ఇందూర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ శాసనసభ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇందూర్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి కాంతారావు హాజరుకానున్నారు. జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరై సన్నాహక సమావేశాన్నివిజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కోరారు.

