మహిళలు, పిల్లల భద్రతకు పోలీసుల కొత్త యాప్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు మరింత ప్రయారిటీ ఇవ్వాలని భావించింది. దేశవ్యాప్తంగానే పెరుగుతున్న క్రైమ్ రేట్‌ను గమనంలోకి తీసుకుని తెలంగాణ పోలీసు విభాగం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వినియోగించాలని భావిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 మార్చిలో ప్రవేశపెట్టిన ‘టీ-సేఫ్’ (T Safe App)  మొబైల్ యాప్‌ అమలుపై పోలీస్ డిపార్టుమెంట్ రివ్యూ చేసింది. మహిళల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసకుని లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం వినియోగిస్తున్న టీ-సేఫ్ యాప్‌లోని లోపాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలను సమీక్షించి వీలైనంత తొందరగా అడ్వాన్స్ యాప్‌గా వినియోగంలోకి తేవాలనుకుంటున్నది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యాడ్ చేయడంతో పాటు అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా ఇంటిగ్రేట్ అయ్యేలా ఆలోచిస్తున్నది.

మొబైల్, వెబ్, యాప్‌లు ఏకకాలంలో పనిచేసేలా :

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓఎస్ అలర్ట్ ఆల్రెడీ ఉన్నది. డయల్ 100 కూడా వాడుకునే వెసులుబాటు ఉన్నది. రెండేండ్ల క్రితం తెచ్చిన టీ-సేఫ్ అదనంగా తోడైంది. ఈ మూడింటిలోని టెక్నికల్ లోపాలను సరిదిద్దడం కోసం టీ-సేఫ్ సెకండ్ వర్షన్‌ను అందుబాటులోకి తేవాలని పోలీసు శాఖ భావించింది. ప్రస్తుతం పనిచేస్తున్న టీ-సేఫ్ లోని సాంకేతిక సమస్యలను, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడానికి కసరత్తు మొదలైంది. సామాన్యులు ఇప్పటికీ వాడుతున్న కీ-ప్యాడ్ ఫోన్ల మొదలు యాపిల్ ఫోన్ వరకు అన్నింటికీ ఉపయోగపడేలా మార్చాలని నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డయల్ 112 సేవలకు కూడా ఈ కొత్త వర్షన్‌ను అనుసంధానం చేయాలనుకుంటున్నది. ఆపదలో ఉన్న ప్రతీ మహిళను సేఫ్‌గా ఇంటికి చేరేంతవరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ ట్రాకింగ్, రియల్ టైమ్ ట్రేసింగ్ చేసేందుకు వీలుగా కొత్త వర్షన్ రూపొందుతున్నది.

తెలుగు భాషలోనూ టీ-సేఫ్ సెకండ్ వర్షన్ :

ప్రస్తుతం ఇంగ్లీషు భాషలో మాత్రమే అందుబాటులో ఉన్న టీ-సేఫ్ మొబైల్ యాప్‌ను హిందీ, తెలుగు భాషల్లోనూ అందుబాటులోకి తేవాలని పోలీసు శాఖ భావిస్తున్నది. ఇకపైన కొత్తగా రూపొందే వర్షన్ ప్రత్యేకతలు సంక్షిప్తంగా.. :
• ప్రస్తుతం యాండ్రాయిడ్ ఓఎస్‌కు మాత్రమే వాడేందుకు వీలుండగా ఇకపైన యాపిల్ ఫోన్‌కు సైతం వర్తించేలా రూపొందనున్నది.
• హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలకు మాత్రమే రియల్ టైమ్ మానిటరింగ్ సాధ్యమవుతున్నందున ఇకపైన హద్దుల్లేకుండా రాష్ట్రమంతా వర్తించేలా మార్పులు జరుగుతున్నాయి.
• ప్రస్తుతం వినియోగంలో ఉన్న టీఎస్-కాప్ యాప్‌తో అనుసంధానం.
• క్యాబ్ అగ్రిగేటర్‌లు ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి ప్రైవేటు సంస్థలతో పాటు తెలంగాణ ఆర్టీసీతోనూ అనుసంధానం. ఆపద సమయంలో ఆ సర్వీసుల్లో విధుల్లో ఉన్న డ్రైవర్ల వివరాలు కూడా కొత్త యాప్‌కు ఇంటర్ లింక్.
• యాప్ ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధుల నుంచి ఎస్ఓఎస్ రాగానే ఫీల్డ్ మీద ఉన్న పోలీసులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ మధ్య కోఆర్డినేషన్ మెకానిజంతో పాటు డ్యాష్ బోర్డు మీద లైవ్ ట్రాకింగ్, రియల్ టైమ్ స్టేటస్ డిస్‌ప్లే.
• స్మార్ట్ ఫోన్ వాడని మహిళల కోసం ఓటీపీ విధానాన్ని అమలు చేయడం, వారితో వీలైనంతగా కాల్ చేస్తూ టచ్‌లో ఉండేలా యాప్ అప్‌గ్రెడేషన్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>