మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంతో అవసరం: పువ్వాడ

​కలం, ఖమ్మం బ్యూరో: చిన్నారులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్, కరాటే ఎంతో అవసరమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. ఆదివారం ఖమ్మంలోని షాదీఖానాలో బీఆర్ఎస్ మాజీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ బాబా జ్ఞాపకార్థం ‘ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్’ పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖమర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన పువ్వాడ అజయ్ కుమార్ పోటీలను ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వలన పిల్లల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.

ఆత్మరక్షణ కోసం మాత్రమే..

ఆపద ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ విద్య ఎంతో దోహదపడుతుందని పువ్వాడ తెలిపారు. నేర్చుకున్న విద్యను ఇతరులపై దాడి చేయడానికి కాకుండా, కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. పదేళ్లుగా తాను ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నానని పువ్వాడ గుర్తు చేసుకున్నారు.

అనంతరం నిర్వాహకులు గఫూర్, కరాటే మాస్టర్లు, క్రీడాకారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, నాగండ్ల కోటేశ్వరరావు, బత్తుల మురళి, దేవభక్తిని కిషోర్, తౌసిఫ్, గాదె అనిల్, సురేష్, వీరేందర్, షకీనా, ఉస్మాన్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>