చివరి బంతికి విజయం.. కర్ణాటక హిస్టారిక్ విక్ట‌రీ!

క‌లం, స్పోర్ట్స్: 11 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన రైల్వేస్‌కు కర్ణాటక మహిళల జట్టు షాకిచ్చింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో మూడు పరుగుల తేడాతో గెలిచి తొలిసారి సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ (T20 Trophy)ని కైవసం చేసుకుంది. నవంబర్ 20న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 149/8 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ సతీశ్ 48, నికీ ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనలో రైల్వేస్ 146/8 పరుగులకే పరిమితమైంది. అర్షి గోయల్ (41), మిన్ను మణి (30) పోరాడినా కర్ణాటక బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీశారు. తేజస్విని మూడు, శ్రేయాంక రెండు వికెట్లు పడగొట్టారు. చివరి ఓవర్‌లో రైల్వేస్ విజయానికి 18 పరుగులు కావాలి. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన చివరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి.

ఆ సమయంలో తనూజ కన్వర్ రనౌట్ కావడంతో కర్ణాటక మూడు పరుగులతో గెలిచింది. టోర్నీలో శ్రేయాంక పాటిల్ 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచింది. కెప్టెన్ శుభ సతీశ్ 462 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక పరుగుల వీరురాలిగా నిలిచి ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంది. ఈ విజయం తమ జట్టు సమష్టి కృషికి ఫలితమని శుభ సతీశ్ తెలిపింది. జట్టు సభ్యులందరి సహకారం, ముందస్తు సాధన విజయానికి కారణమయ్యాయని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>