ఏపీలో రోడ్డు ప్రమాదం.. జబర్దస్త్ ఆర్టిస్టులకు గాయాలు!

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ఆర్టిస్టులు దొరబాబు(Dorababu), రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు(Jabardasth Artists Injured). కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న దొరబాబు, రైజింగ్ రాజు(Rising Raju)లకు గాయాలు (Jabardasth Artists Injured) కాగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ అక్కడ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : తక్కువ నీటితో సిరుల పంట.. ఇదీ ‘అంకాపూర్’ మ్యాజిక్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>