ఢిల్లీ ఘటనపై నిరసన.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఘటనపై నిరసనగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ (Congress Candle Rally) నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుంది.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్ర వైఖరిని నిరసించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>