సామాన్యులకు బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు!

కలం, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. ఆగస్టు నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరలను (LPG Price Hike)  తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. సెప్టెంబన్ 1న మళ్లీ పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటన ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 9.50 వరకు పెరిగింది. దీంతో ఢిల్లీలో నిన్నటిదాకా రూ.2,738 గా ఉన్న సిలిండర్ ధర నేటి నుంచి రూ.2,747.50కు చేరుకుంది.అటు హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 11 పెరిగి రూ.2,996కి ఎగబాకింది.

అయితే కమర్షియల్ సిలిండర్ల రేట్లు పెరిగినప్పటికీ 14.2 కేజీల సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు పెంచలేదు. ఇళ్లలో వాడే గ్యాస్ ధరలు మునపటిలాగే స్థిరంగా ఉన్నాయి. అటు 5 కేజీలు, 10 కేజీల చిన్న తరహా సిలిండర్ ధరల్లోనూ ఎటువంటి మార్పు లేదు. సాధారణ 5 కేజీల చిన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 349.50కే లభించనుండగా.. ఎక్స్‌ట్రాలైట్ సిలిండర్ ధర రూ. 339 వద్దే ఉంది. కానీ 5 కేజీల గృహేతర సిలిండర్ ధర మాత్రం రూ. 762 నుంచి రూ. 764కు పెరిగింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>