డిసెంబర్ నాటికి వంద పడకల ఇల్లందు ఆసుపత్రి: కలెక్టర్ అంకిత్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు (Yellandu) పట్టణంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. రూ.37.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, పనులను వేగవంతం చేసి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రిలోని ఐసీయూ, ఎమర్జెన్సీ, ఓపీ, ఐపీ విభాగాలు రోగులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించాలని, నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ​అనంతరం ఇల్లందు (Yellandu) చెరువును సందర్శించిన కలెక్టర్, నీటి నిల్వలు రోజువారీ తాగునీటి సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అనంతరం సుందిమళ్ల టీజీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి విద్యాబోధన, వసతుల గురించి వివరాలు సేకరించారు. భవనం, భోజనశాల లీకేజీ సమస్యలకు వెంటనే మరమ్మతు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

అలాగే స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో ధన్సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అధికారులు పాల్గొన్నారు.

Also Read : రాహుల్ గాంధీకి షాక్.. నోటీసులు జారీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>