కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి భూమి వివాదంలో ఉంది. ఈ విషయమై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha) స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో బచ్చటపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ అల్వాల నర్సింగరావు ఆధ్వర్యంలో పలు ప్రజాసంఘాల నేతలు, నాయకులు కలెక్టర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గుడి ప్రాంగణంలో ఉన్న వేప, రాగి చెట్లకు కలెక్టర్ పేరును నామకరణం చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 1966లో గ్రామపంచాయతీకి ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన భూమి అక్రమ మ్యూటేషన్‌గా గుర్తించబడిందన్నారు.
ఈ విషయమై కలెక్టర్ విచారణ జరిపి, ఆ భూమిని గుడికి కేటాయించాలని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొని బాలకిషన్ గౌడ్, కొండి వెంకటరెడ్డి, మహమ్మద్ మసూద్, మహమ్మద్ గౌస్, బొమ్మెన ఆంజనేయులు, గిరబోయిన బాల సిద్ధులు, కుమ్మరి కేశయ్య, పురాణం శ్రీనివాస్, మోహన్ రెడ్డి, మచ్చ నరేందర్, చిలుముల సుధాకర్ రెడ్డి, కూరల వెంకటరెడ్డి, కర్రే రాజు, గుంటుపల్లి హరి, వార్డ్ మెంబర్లు, కర్రె ప్రశాంత్, కనకం విజయ్, ముద్దసాని అనిల్, కక్కర్ల భవాని, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

