Mobile Popup Ad
Mobile Popup Ad

జగిత్యాల జిల్లాలో ఇల్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) పట్టణంలోని మోచి బజార్‌లోని రాచర్ల గంగాధర్‌ అనే వ్యక్తి ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల విలువైన కుట్టు మిషన్లతో పాటు ఇతర సామగ్రి కాలి బూడిదైంది. సుమారు రూ. 8 నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన వీధిలోకి కనీసం ఫైర్ ఇంజిన్ పోయేలా రోడ్డు వెడల్పు లేకపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ,స్థానిక కౌన్సిలర్ అడవాల జ్యోతి కోరారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా తమ వంతుగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>