చౌడారం పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కలం, జనగామ :  జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha) బుధవారం చౌడారం (Chowdaram) గ్రామ పంచాయతీ పరిధిలోని టీజీఎంఎస్ & జూనియర్ కళాశాల (పీఎం శ్రీ పాఠశాల) ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, వసతులను ఆయన స్వయంగా పరిశీలించారు. కెమిస్ట్రీ, బయాలజీ, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ ల్యాబ్‌లను సందర్శించిన కలెక్టర్..  ప్రయోగశాలలు విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే లైబ్రరీని పరిశీలించి, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని లైబ్రేరియన్‌ను ఆదేశించారు. పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు.

‘బడి బాట’ కార్యక్రమంపై కలెక్టర్ (Collector Sandeep Kumar Jha) ప్రత్యేకంగా దృష్టి సారించారు. బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలో అందించే త్రాగునీటిని ప్రతి మూడు నెలలకు ఒకసారి ల్యాబ్ పరీక్షలు చేయించి శుభ్రమైన నీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: తిరుపతి వెళ్తున్నారా.. ఇవిగో స్పెషల్ ట్రైన్స్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>