శోభాయాత్రలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడు శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయత్ర ర్యాలీలో రాజాసింగ్ చేసే కామెంట్లు సంచలనంగా మారుతూ ఉంటాయి. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ఎంఐఎం ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటనను రాజాసింగ్ గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం వందేమాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పుడే ఎంఐఎం ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

తాజాగా రాజాసింగ్ (Raja Singh) ఈ అంశాన్నే ప్రస్తావించారు. వందేమాతరం పాడటానికి చేతగానోళ్లు అసెంబ్లీకి ఎందుకొచ్చారు? అంటూ ప్రశ్నించారు. కనీసం వందేమాతారం గీతాలాపన సమయంలో అసెంబ్లీలో ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారంటూ ఫైర్ అయ్యారు. శోభాయాత్ర సందర్భంగా నిర్వహించిన సభలో రాజాసింగ్ ఈ ప్రస్తావన తీసుకురాగానే యువకులు ఆయనకు గట్టిగా మద్దతు పలికారు.

Read Also: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ స్టాండ్ ఇదే..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>