బాసర ఆలయ పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, బాసర: గోదావరి నది పుష్కరాల (Godavari Pushkaralu) నిర్వహణకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదేశించారు. గురువారం బాసర ఆలయ ఈఓ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్ల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుష్కరాల కోసం చేపట్టిన పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ప్రతి శాఖాధిపతి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షించాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. గోదావరి నదిలో ప్రస్తుత నీటిమట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఫొటోల రూపంలో పంపించాలని ఆదేశించారు. పనులకు సంబంధించి అవసరమైన అనుమతులు, ప్రభుత్వపరమైన నిర్ణయాలు పెండింగ్‌లో ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పుష్కరాల (Godavari Pushkaralu) సందర్భంగా వచ్చే ప్రముఖుల వసతి కోసం చేపడుతున్న భవన నిర్మాణ పనులపైనా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఇరిగేషన్ ఈఈ అనిల్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం: కేటీఆర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>