కలం, నర్సాపూర్ (జి) : కాళేశ్వరం 27 ప్యాకేజీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, కాలువ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. మంగళవారం నర్సాపూర్ (జి) సమీపంలో నిర్మాణంలో ఉన్న కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణ పనుల పురోగతి, ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటితో ప్రయోజనం పొందే మండలాలు, భూసేకరణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత మ్యాపులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడంలో కీలకమైన ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ అనిల్, ఏడి ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ ఏఈ గంగాధర్, ఉన్నారు.

