ధాన్యం కొనుగోలు కేంద్రంలో క‌లెక్ట‌ర్‌ ఆకస్మిక‌ తనిఖీ

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోని మాయిశ్చర్ మిషన్, తూకం యంత్రాలు, గ్రేడింగ్ యంత్రాలు తదితర సదుపాయాలను పరిశీలించి, కొనుగోలు ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం కొనుగోలు వివరాలు, ప్రస్తుత సీజన్ అంచనాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల నిల్వలపై సమాచారం సేకరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని సూచించారు. చెల్లింపులు ఆలస్యం కాకుండా తక్షణమే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, పారదర్శకత పాటించాలని ఆదేశించారు.

అనంతరం కరివారిగూడెం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన కలెక్టర్ తాగునీటి సరఫరాలో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా బోర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. వేసవి కాలం మొత్తం తాగునీటి ఎద్దడి లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also: సురక్షిత ప్రయాణాలే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం: అడిషనల్ డీజీ చారు సిన్హా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>