కలం, వెబ్ డెస్క్ : పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అవకతవకలపై పలు రాష్ట్రాలలో నిరసనలకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) జైపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తీవ్ర కలకలం రేగింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) పై దాడి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వేళ ఆయన చెంబదెబ్బ తిన్నారు . గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. అంతేకాదు ఆందోళనలో పాల్గొన్న ఇద్దరు యువకులపై కొందరు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురి మొబైల్స్ చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

