లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

కలం, బోథ్: ప్రజా పాలనలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారికి చేరువ చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ఉద్దేశమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ అన్నారు. శుక్రవారం బోథ్ పట్టణ కేంద్రంలో ఏడుగురు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను (CMRF Cheques) పంపిణీ చేశారు.

మొత్తం రూ.5.10 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ ఇళ్లకు స్వయంగా వచ్చి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేయడం పట్ల లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>