చారిత్రాత్మక పోరాటాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యానికే ముప్పు: హనీఫ్ అహ్మద్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, విద్యార్థులు, ప్రజల చారిత్రాత్మక పోరాటాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు అని తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ (Hanif Ahmed) తెలిపారు. శుక్రవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దేశ మూలవాసులు , ఈ నేల బిడ్డలను కాగితాల పేరుతో పౌరసత్వం నుండి దూరం చేయడం రాజ్యాంగానికి ప్రజాస్వామ్య ఆత్మపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల విధానం ఈవీఎంలు, ఈసీఐ నెట్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఈసీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒడిశా, బీహార్, బెంగాల్ లలో ఈవీఎంల దుర్వినియోగం వల్ల నమ్మకం పోతోందని యూపీ సహా అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని, ప్రజల ప్రమేయం లేని అక్రమాలు నియంతృత్వమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈసీఐ నెట్ ద్వారా ఓటర్ల జాబితాను మార్చి పౌరసత్వాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని, ఈఆర్ఓ నెట్ అధికారాలను ఢిల్లీకి తరలించి లక్షలాది మంది నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈసీఐ నెట్ ఎస్ఐఆర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల దళితులు, ఆదివాసీలు, కార్మికులు, రైతులు, పేదలు, మైనారిటీల ఓటు హక్కు పౌరసత్వం ప్రమాదంలో పడుతున్నాయని, ఢిల్లీ నుండి ఓట్లను నిర్ణయించడం సమాఖ్య వ్యవస్థకే ముప్పని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఓటర్ ఐడీని అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లు తొలగిపోయి నిజమైన పౌరుల హక్కులు సురక్షితంగా ఉంటాయని, స్థానిక అధికారుల పరిశీలనకే ప్రాధాన్యత లభిస్తుందని హనీఫ్ అహ్మద్ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>