కలం, నాగర్‌కర్నూల్: జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, అవమానాలను అరికట్టాలని, జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని పటిష్టం చేయాలని కోరుతూ నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రంలో TUWJ-IJU ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ (TUWJ-IJU Rally) నిర్వహించారు. బస్టాండ్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, ర్యాలీ గాంధీ పార్క్ వరకు సాగింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, బస్సు పాసులు పూర్తిస్థాయిలో మంజూరు చేయాలని, అర్హులైన నిరుపేద జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
విధి నిర్వహణలో దాడులను ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వసతులు, ప్రత్యేక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల సంక్షేమం, కుటుంబ భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ-IJU రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. విజయకుమార్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ వచ్చేసింది!
Follow Us On: Youtube

