తమిళనాడు బడ్జెట్.. సీఎం విజయ్ వరాల జల్లు

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలుపొందిన టీవీకే పార్టీ.. డీఎంకే పార్టీని గద్దెదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ (CM Vijay) ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదిశగా విజయ్ సర్కార్ ముందుకుసాగుతోంది. ఈ తరుణంలోనే తన కేబినెట్‌తో తీవ్ర చర్చలు జరిపిన సీఎం.. వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రిగా సీఎం విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విద్య, నైపుణ్యాభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు.

వధువుకు బంగారం, పట్టుచీర..

తాజా బడ్జెట్‌లో ఎన్నికల హామీల్లో భాగమైన అన్నన్ సీర్ తిట్టమ్ పథకాన్ని విజయ్ సర్కార్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా వధువుకు 8 గ్రాముల బంగారు నాణెం, ఒక పట్టు చీరను అందజేయనున్నారు. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.812 కోట్లు కేటాయించారు. ఇక ఆరోగ్య రంగానికి రూ.23 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ‘తై మామన్ తంగా మోదిరం తిట్టం’ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా పుట్టే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారపు ఉంగరాన్ని అందించనున్నారు. ఈ పథకానికి రూ. 560 కోట్లు కేటాయించారు.

విద్యార్థులకు సైకిళ్లు..

విద్యాశాఖకు సైతం అతధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎం విజయ్.. విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. ఇక కాలేజీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లను సైతం అందించనున్నారు. ‘వెట్రి ల్యాప్ టాప్’ పేరిట తీసుకొచ్చిన ఈ పథకానికి రూ.2,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో స్కూళ్ల అభివృద్ధికి రూ.139 కోట్లు కేటాయించారు. ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థులకు సైకిళ్లతో పాటు హెల్మెట్ కూడా ఇవ్వనున్నారు. దీని ద్వారా 5.3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>