కలం, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) వెళ్లనున్నారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. 9,10 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ.. పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో 9వ తేదీన కేటీఆర్, 10వ తేదీన హరీశ్ రావు హాజరు కానున్నారు.
కాగా, జులై 30 గురువారం అర్ధరాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) మరణించారు. అయన తుది శ్వాస విడిచినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. పెద్ది మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పలువురు రాజకీయ నేతలు ఆయన భౌతిక కాయానికి ఆస్పత్రిలో నివాళి అర్పించారు. స్వగ్రామం నల్లబెల్లిలో జులై 31న పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. మంత్రి సీతక్క, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులు అర్పించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డిని కడసారి చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు.

