Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ తో సహా తొమ్మిదిమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో రేపు (సోమవారం) ఉదయం 9.30 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటగా ప్రోటెమ్ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు.

అనంతరం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రోటెమ్ స్పీకర్ చేత లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరి చేత ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మొత్తం 234 మంది సభ్యుల్లో విజయ్ సహా పది మంది ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. కావున మిగిలినవారితో ప్రోటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రతిపక్ష సభ్యులు, సీనియర్ నేతలు రాకపోతే వారికి విడిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>