Mobile Popup Ad
Mobile Popup Ad

రేపే సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం.. గెస్ట్‌లు ఎవరంటే!

కలం, వెబ్ డెస్క్: రేపు ఉదయం 11 గంటలకు తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ (Vijay) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ను విజయ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అలాగే డీఎంకే అధినేత స్టాలిన్, ఏఐడీఎంకే అధినేత పళిని స్వామికి కూడా ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. తొలుత 20 మంది మంత్రులతో విజయ్ తన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యేల మద్దతుపై అస్పష్టత..

గవర్నర్‌కు విజయ్ సమర్పించిన జాబితాలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినా.. ఇంకా అస్పష్టంగానే ఉంది. లేఖలో అయితే 116 మంది ఎమ్మెల్యేల సంతకాలు గవర్నర్‌కు సమర్పించారు. విజయ్ గవర్నర్‌ను కలిసిన తర్వాతే వీసీకే మద్దతు లేఖ బయటకు రావడం ఉత్కంఠ రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>