రైతులకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటాం : ఆకుల నరసయ్య

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతు సంక్షేమంలో దిక్సూచిగా నిలిచేలా కృషి చేస్తామని కరీంనగర్ (Karimnagar) మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ ఆకుల నరసయ్య పేర్కొన్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులను రాజేందర్రావు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కరీంనగర్ మార్కెట్ యార్డ్ పరిధిలో రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. ధాన్యం కొనుగోలు తోపాటు మద్దతుగా కల్పించే విషయంలో రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అదేవిధంగా 1991 వ సంవత్సరంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన వెలిచాల రాజేందర్ రావు సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. గొప్ప మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు తనతోపాటు పాలకవర్గం కృషి చేస్తుందన్నారు. తనతో పాటు డైరెక్టర్లంతా వ్యవసాయంపై చక్కని అవగాహన ఉందని, రైతుల కష్టసుఖాలు అందరికీ తెలుసు అని తెలిపారు. రైతులకు సేవ చేసే గొప్ప బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందని, ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతుల సేవకే అంకితమై పని చేస్తామని పేర్కొన్నారు. ఒకవైపు రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూనే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఆకుల నరసన్న తెలిపారు. మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు విప్ లు ఎమ్మెల్యేలతో పాటు కరీంనగర్ కాంగ్రెస్ నేతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ తో పాటు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను వెలిచాల రాజేందర్ రావు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మదా, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా అన్నదానం..

అనంతరం రాష్ట్ర రవాణా బిజీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్న ప్రభాకర్ జన్మదిన సందర్భంగా కట్టరాంపూర్ హనుమాన్ టెంపుల్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య కార్పొరేటర్ ఆకుల నర్మదా ఆధ్వర్యంలో హనుమన్ స్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆకుల నరసయ్య నర్మద హనుమాన్ భక్తులకు స్వయంగా వడ్డించారు. అదేవిధంగా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన సందర్భంగా ఆకుల నరసయ్య మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>