కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ (CM Revanth) శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కొడంగల్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారని కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చేతులు మీదుగా రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయం, రూ.2 కోట్లతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం, రూ.2.14 కోట్లతో దౌల్తాబాద్ లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, రూ.250 కోట్లతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాల పనులను ప్రారంభిస్తారని వివరించారు. పలు నిర్మాణాలకు శంకుస్థాపనల అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలోసీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.కాగా, సభ ఏర్పాట్ల పనులను ప్రత్యేక కార్యదర్శి శ్రీనివాసరాజు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, సమాచార శాఖ కమిషనర్ ముకుందరెడ్డి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు.

