Mobile Popup Ad
Mobile Popup Ad

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: CM రేవంత్

కలం, వెబ్ డెస్క్: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల చిన్న రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సీఎం చిట్ చాట్ నిర్వహించి మాట్లాడారు. ఈ నిర్ణయంతో చిన్న రాష్ట్రాలు చిన్నగా ఉంటాయని.. పెద్ద రాష్ట్రాలు, పెద్దగా అవుతాయని చెప్పారు. కేరళలో 20 సీట్లు ఉంటే 30కి పెరుగుతాయి కానీ.. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉంటే 120 పెరుగుతాయని అన్నారు. ఇప్పుడు కనీసం దక్షిణాది నుంచి బండి సంజయ్ (Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan Reddy) లాంటి వాళ్లకు పదవులు దక్కాయని.. నియోజకవర్గాలు పెంచితే వాళ్లకు చిప్రాసి నౌకరి కూడా దొరకదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అమలైతే దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పారు. ఇది పార్టీల సమస్య కాదని.. ప్రజల సమస్య, చిన్న రాష్ట్రాల సమస్య అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో బీజేపీకి సరెండర్ అయ్యి ఉండొచ్చని అన్నారు.

ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల ఆలోచన తీసుకోకుండా ముందుకు వెళితే ప్రజా ఉద్యమాలు మొదలవుతాయని సీఎం అన్నారు. 40 శాతం ఆర్థిక వ్యవస్థ ఇస్తున్న దక్షిణ భారతదేశానికి 40 శాతం సీట్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాష్ట్రాలని.. దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాయని గుర్తు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ రాష్ట్రాలు అని.. అందుకోసమే ఉత్తరాది వారికి పెద్ద పదవులు దక్కుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు మోసపోతున్నాయని.. దీనివల్ల ఇంకా మోసపోతామని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దేశంలో సెకండ్ సిటిజన్ గా బతుకుతున్నాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నెంబర్ లేదు కాబట్టే తాము వెనుకబడ్డామని చెప్పారు. నియోజకవర్గాల బిల్లు ఆమోదం పొందుతే భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆందోళన చేస్తాయని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని.. 2023లో బిల్లు తీసుకొచ్చినప్పుడు దానికి మద్దతు కూడా ఇచ్చామని రేవంత్ (CM Revanth Reddy) తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై ఇండియా కూటమి పార్టీ నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 50 శాతం సీట్లు పెరిగినప్పుడు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి కదా అని అబ్రిప్రాయపడ్డారు. ఓబీసీల రిజర్వేషన్ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 543 లోక్ సభ సభ్యుల సంఖ్యా ప్రకారం 181 మహిళా రిజర్వేషన్ ఇస్తే సరిపోతుంది కదా.. దానికోసం నియోజకవర్గాల పెంపు ఎందుకు? అని రేవంత్ ప్రశ్నించారు.

Read  Also: టీ.చిరంజీవులుకు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>