భాగ‌మతి మూవీ డైరెక్ట‌ర్‌పై చీటింగ్ కేసు!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ డైరెక్ట‌ర్ గుడ్లూరి అశోక్ బాబు (Gudluri Ashok Babu)పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదైంది. త‌న కొడుకును హీరోను చేస్తాన‌ని చెప్పి అశోక్ బాబు త‌మ నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నాడ‌ని ఓ దంప‌తులు సైబ‌రాబాద్ ఈవోడ‌బ్ల్యూలో ఫిర్యాదు చేశారు. త‌మ కొడుకును హీరోను చేయ‌క‌పోవ‌డ‌మే కాకుండా డ‌బ్బులు కూడా వెన‌క్కి తిరిగి ఇవ్వ‌డం లేద‌ని వారు ఆరోపించారు. దీంతో పోలీసులు అశోక్ బాబుతో పాటు, నిర్మాత విజ‌య ల‌క్ష్మిపై కేసు న‌మోదు చేసుకున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రినీ సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో విచారిస్తున్నారు.

అశోక్ బాబు 2007లో ఉషోద‌యం అనే సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొద‌టి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ త‌ర్వాత సుకుమారుడు, చిత్రాంగ‌ద‌, ఆకాశ రామ‌న్న అనే సినిమాలు చేసినా పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. కానీ, 2011లో వ‌చ్చిన పిల్ల జ‌మిందార్ ఆయ‌న‌కు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను అందించింది. ఇక 2018లో స్టార్ హీరోయ‌న్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన భాగ‌మ‌తి ఎంత‌పెద్ద స‌క్సెస్‌గా నిలిచిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా కెరీర్‌లో మంచి గుర్తింపు వ‌స్తున్న స‌మ‌యంలోనే అశోక్‌బాబు చీటింగ్ కేసులో చిక్కుకోవ‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>