విషాదం.. ఫలితాల భయమే ప్రాణాలు తీసిందా!

కలం, ఖమ్మం బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫెయిల్ అవుతాననే భయంతో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్ది సూసైడ్ చేసుకున్న ఘటన ఖమ్మం (Khammam) జిల్లా మధిర రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోనకల్లు మండలం, రాపల్లి గ్రామానికి చెందిన జీ.ఆశాంత్(17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతను మధిర రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో పట్టాల మీద రెండు ముక్కలుగా పడి విగతజీవిగా మిగిలాడు. అయితే ఇంటర్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఆశాంత్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య కు పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో సదరు విద్యార్ది మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని,మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబులు ఎస్. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ నెల 12న ఇంటర్ పలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడరాదని, పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదని, విద్యార్ధులు దైర్యంగా ఉండేలా తల్లితండ్రులు ప్రోత్సహించాలని ఖమ్మం రైల్వే ఎస్ఐ వెంకటేశ్వరరావు హితవు పలికారు.

Read Also: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: CM రేవంత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>