టీ.చిరంజీవులుకు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులు “మహాత్మ జ్యోతిరావు ఫూలే ఎక్సలెన్స్ అవార్డు – 2026 (Mahatma Jyotirao Phule Excellence Award 2026)” అందుకున్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ సిహెచ్ మధుసూదనాచారి, టైర్డ్ డిజిపి, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కన్వీనర్ పూర్ణచందర్రావు, బీసీ పొలిటికల్ ఫ్రెండ్స్ చైర్మన్ బి. బాలరాజ్ గౌడ్, తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా. రాజ్ నారాయణ ముదిరాజ్ పాల్గొని అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే చేసిన కృషిని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నేటి యువత నడవాలని సూచించారు. అనంతరం టి. చిరంజీవులు మాట్లాడుతూ, ఫూలే ఎక్సలెన్స్ అవార్డు (Mahatma Jyotirao Phule Excellence Award 2026) తో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. బీసీ ఐక్యత కోసం తన వంతు కృషి కొనసాగిస్తానన్నారు. పోరాటాల ద్వారా హక్కులను సాధించేందుకు అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువస్తానని చెప్పారు. తాను రచించిన పుస్తకాలు, ప్రసంగాల ద్వారా వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి, మహాత్మ జ్యోతిరావు పూలే కలలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే, మాస్టర్ ఆఫ్ సెరిమనీ ప్రోగ్రాం అడ్వైజర్ డా. రవితేజ మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను వివరిస్తూ ఆయన సేవలను స్మరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ సత్యం, ఆర్. రవీందర్, కోరేళ్ళ చంద్రయ్య, మహేష్ కుమార్ ముదిరాజ్, టీసీసీ కోఆర్డినేటర్లు డా. సాయికిరణ్, జి. వేణుగోపాల్, బిచ్చుకారి సూర్య, రామ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>