నేడు సైబరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు సైబరాబాద్‌లో పర్యటించబోతున్నారు. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. సుమారు రూ.1,674 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. భవిష్యత్తు అవసరాల ఆధారంగా సరికొత్త డిజైన్‌తో రూపకల్పన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అనంతరం అక్కడ జరిగే సభలో పాల్గొంటారని సమాచారం.

హైదరాబాద్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ..

సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) హైదరాబాద్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. నిన్న మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి, ఈ రోజు సైబరాబాద్‌లోనూ శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక శాశ్వత భవనానికి అంకురార్పణ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.

Read Also:  మెట్రో సెకండ్ ఫేజ్.. ఇంకా పరిశీలనలోనే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>