కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో తేలికపాటి వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వీటితో పాటు రాజధాని హైదరాబాద్, హనుమకొండ, జనగామ, కరీంనగర్, మేడ్చల్, మెదక్, ములుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా తేలికపాటి వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాబోయే కొద్ది గంటల్లో ఈ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా చిరుజల్లులు పడతాయని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.
Read Also: తెలంగాణ కేబినెట్‌లో మార్పులు.. కీలక మంత్రులు ఔట్?
Follow Us On : WhatsApp

