Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు భద్రాచలంలో సీఎం పర్యటన

కలం, ఖమ్మం బ్యూరో: శ్రీ రామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు భద్రాచలం (Bhadrachalam)లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించనున్నారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని 10.10కి భద్రాచలం చేరుకుంటారు. ఐటీసీ గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుని, 10.40 కి రామాలయం చేరుకుని దర్శనం చేసుకుంటారు.

అనంతరం రూ.351 కోట్లతో ఆలయ విస్తరణ తొలి దశ అభివృద్ధి పనులకు భూమి పూజ,శంకుస్థాపన చేయనున్నారు.11.35 గంటలకు మిథిలా స్టేడియంలో శ్రీరామనవమి కల్యాణ క్రతువులో పాల్గొని సతీ సమేతంగా సీతా రామచంద్ర మూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. 12.30వరకూ కళ్యాణ వేడుకల్లో పాల్గొని 1.20కి తిరిగి హైద్రాబాద్ బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>