కలం, వరంగల్ బ్యూరో: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఉదయం ఆవిష్కరించారు. సీఎం ఆదివారం రాత్రి మేడారంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హరిత హోటల్లో బస చేశారు. సీఎంతో పాటు మంత్రులంతా ఇక్కడే ఉన్నారు. సోమవారం సీఎం అభివృద్ధి, విస్తరణ జరిగిన గద్దెలు, గద్దెల (Gaddelu) ప్రాంగణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గద్దెలను పూలతో అందంగా అలంకరించారు.


