epaper
Monday, January 19, 2026
spot_img
epaper

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు

కలం, వెబ్ డెస్క్: దక్షిణ స్పెయిన్‌లో (Spain) ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును (Train Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండో రైలు పట్టాల తప్పడంతో 21 మంది మరణించారని, 100 మందికిపైగా గాయపడినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాజధాని మాడ్రిడ్‌కు దక్షిణంగా 360 కి.మీ (223 మైళ్ళు) దూరంలో ఉన్న కార్డోబా ప్రావిన్స్‌లోని ఆడముజ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

గాయపడిన 18 మందిని ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్పానిష్ రవాణా మంత్రి మాట్లాడుతూ.. పట్టాలు తప్పడం నిజంగా వింతగా ఉందని, ఈ ట్రాక్ గతంలోనే పునరుద్ధరించామని తెలిపారు. ఇర్యో రైలు పట్టాలు తప్పడం వల్లే, మరో రైలు ప్రమాదానికి కారణమైంది, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>