సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో డబ్బు జమ

కలం, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు  (Chandrababu) అందించారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయిప్రసాద్ తదితరులు హాజరయ్యారు. ఉగాది సందర్భంగా నిర్వాసితుల ఖాతాల్లో రూ.226 కోట్లు జమ చేసినట్లు సీఎం వెల్లడించారు. వచ్చే ఉగాది తర్వాత రెండు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు (Chandrababu) చెప్పారు. వారం రోజుల్లో డయాఫ్రమ్‌ వాల్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు రూ.1943 కోట్లు చెల్లించామని వివరించారు. 75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తయ్యాయని.. డిసెంబరు నాటికి మిగతా 49 నిర్వాసిత కాలనీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మరో రూ.3,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు.

నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి రూ.3.5 లక్షల చొప్పున ఇస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితుల స్థలం కోసం ఇచ్చే మొత్తం రూ.2 లక్షలకు పెంచామని వివరించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిర్వాసితులైన యువతకు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>