కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ త్యాగం అంటే ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నల్గొండ ఎన్జీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తరువాత పదవిని త్యాగం చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని గుర్తు చేశారు.
హరీశ్ రావుది త్యాగం కాదు.. వేల కోట్లు దోచుకున్నారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే గతం మాత్రమేనని భవిష్యత్తు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఫామ్ హౌజులు కట్టుకున్న కల్వకుంట్ల కుటుంబానికి.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే కడుపుమంట ఎందుకని రేవంత్ ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వందేళ్ల ధ్వంసం జరిగిందన్నారు.
ఇద్దరు తోడేళ్లు తెలంగాణపై పడి తిరుగుతున్నారని కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలెవరూ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని.. దోపిడి ముఠాలు మాత్రమే బీఆర్ఎస్ రావాలని ఆరాటపడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

