Mobile Popup Ad
Mobile Popup Ad

మేడారం ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష

మేడారం ఆలయ అభివృద్ధి విషయంలో ఆచార సంప్రదయాలను పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. అదే విధంగా అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిపై రేవంత్.. సోమవారం అధికారులతో భేటీ అయ్యారు. వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని.. ఏ మాత్రం పొర‌పాట్లు దొర్లినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హెచ్చరించారు. మేడారం(Medaram) అభివృద్ధి ప‌నుల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. రాతి ప‌నుల‌తో పాటు ర‌హ‌దారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ‌ద్దెల చుట్టూ భ‌క్తుల రాక‌పోక‌ల‌కు సంబంధించిన మార్గాలు, భ‌క్తులు వేచి చూసే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి ఒక్క అంశంపైనా ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

ప‌నులు సాగుతున్న తీరుపై ప్ర‌ద‌ర్శించిన‌ పవ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ను ప‌రిశీలించిన సీఎం ప‌లు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు. ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ‌, దేవాదాయ శాఖ‌, అట‌వీ శాఖ‌, స్థ‌ప‌తి శివ‌నాగిరెడ్డి స‌మ‌న్వ‌యంతో సాగాలని సీఎం సూచించారు. అభివృద్ధి ప‌నుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు పెద్ద పీట వేయాల‌ని సీఎం తెలిపారు. నిర్దేశిత స‌మ‌యంలోనే అభివృద్ధి ప‌నులు పూర్తి కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు.

Read Also: హిల్ట్ పేరుతో సర్కార్ స్కామ్.. TG గవర్నర్‌కు ఫిర్యాదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>