ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతోందని, ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేలా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్ గండికోట వెంకట్ శిరీష్, మార్కెటింగ్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, ఇతర విద్యావేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యా పరిశోధన రంగంలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యం..

హైదరాబాద్ నగరంలో యువ పరిశోధకులు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చాలని సంకల్పించామని స్పష్టం చేశారు. దీని కోసం కేంబ్రిడ్జి వంటి అత్యున్నత విద్యాసంస్థలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వామిగా మారాలని వర్సిటీ ప్రతినిధులను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>