Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరం చేరిన సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమవారం భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం (Kaleshwaram) వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి కాళేశ్వరంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కాళేళ్వర ముక్తేశ్వరస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శ్రీకారం చుట్టారు. రూ.198 కోట్లతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు, కాళేశ్వరం బస్ స్టేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కాగా, మేడిగడ్డ బ్యారేజ్ ను మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సందర్శించనున్నారు. ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు. ప్రాజెక్టు అంశంపై అధికారులను ఆరా తీయనున్నారు. ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Read Also: మరికాసేపట్లో కేసీఆర్, రేవంత్ స్పీచ్.. ఒకటే ఉత్కంఠ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>