Mobile Popup Ad
Mobile Popup Ad

కొత్త బట్టలు కొన్న వెంటనే వేసుకుంటున్నారా?.. బీ అలర్ట్

కలం, వెబ్ డెస్క్: కొత్త బట్టలు (New Clothes) చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ వాటిని ఉతకకుండా ధరించడం వల్ల ఆరోగ్యానికి హానికరం. దుస్తుల తయారీ ప్రక్రియలో వాడే రంగులు, ముడతలు పడకుండా ఉండటానికి ‘ఫార్మాల్డిహైడ్’ లాంటి రసాయనాలను ఉపయోగిస్తారు. అలాగే షాపుల్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు చాలామంది కొత్త బట్టలను ట్రయల్ వేసి చూస్తుంటారు. దీనివల్ల ఒకరి నుంచి మరొకరికి బ్యాక్టీరియా, ఫంగస్, చర్మ వ్యాధులు (Skin Problems) సోకే ప్రమాదం ఉంది. అందుకే కొత్త బట్టలను మొదటిసారి వేసుకునే ముందు తప్పనిసరిగా ఉతకాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారిలో ఉతకని కొత్త బట్టలు ధరించడం వల్ల ‘కాంటాక్ట్ డెర్మటైటిస్‘ వంటి చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, ఎర్రటి మచ్చలు ఏర్పడవచ్చు. అలాగే బట్టల్లో అదనపు రంగులు చెమటతో కలిసినప్పుడు చర్మానికి చికాకు కలిగిస్తాయి. కాబట్టి కొత్త బట్టలు (New Clothes) కొన్నప్పుడు వాటిని గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్‌తో ఉతకాలి. ఆరబెట్టిన తర్వాతే ధరించడం వల్ల ఆరోగ్యానికి, చర్మానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: మరికాసేపట్లో కేసీఆర్, రేవంత్ స్పీచ్.. ఒకటే ఉత్కంఠ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>