రాజ్యాంగంపై దాడికి కుట్రలు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ మార్చ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కొన్ని పార్టీలు దేశ రాజ్యాంగంపై దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంపై జరుగుతున్న ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికోట్టాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలోని ప్రజలందరికీ సమాన న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు దీనిని రూపొందించారని సీఎం పేర్కొన్నారు. అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమని ఆయన తెలిపారు. పరిపాలనను నేరుగా ప్రజల చేతుల్లో పెట్టింది ఈ రాజ్యాంగమేనని, తమ పాలకులను తామే ఎన్నుకునే విధానాన్ని రాజ్యాంగం పౌరులకు అందించిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.

Also Read : హర్యానాలో గ్యాంగ్ వార్.. ధాబా వద్ద అసలేం జరిగింది?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>