కలం, వరంగల్ బ్యూరో: సీఎం స్నేహితుడ్ని అంటూ మహిళ పేరుతో రూ.20 లక్షల లోన్ తీసుకున్నాడో వ్యక్తి. తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసిన ఘటన వరంగల్ (Warangal) జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హన్మకొండ చౌరస్తాలో జయసుధ అనే మహిళ లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తోంది. నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బండి భారతి కుమారుడు సందీప్.. జయసుధతో పరిచయం పెంచుకున్నాడు. నమ్మశక్యంగా ఉంటూ ఆమె పేరుపై రూ.20 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నాడు.
అనంతరం లోన్ చెల్లించకపోగా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. లోన్ క్లియర్ చేయాలని అడిగినందుకు ఇంటిపై దాడికి దిగాడు. జయసుధతోపాటు ఆమె భర్త రాధాకృష్ణను కొట్టి ఒంటిపై ఉన్న బంగారు నగలు, కారు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నాయకుడు బండి సందీప్, అతని తల్లి నర్సంపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి భారతి, బండి రమేష్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read Also: నల్లగొండలో పొలిటికల్ ట్విస్ట్.. కాంగ్రెస్, BRS ఒక్కటై ఏకగ్రీవాల దండయాత్ర!
Follow Us On: Instagram


