సీఎం రేవంత్ రెడ్డితో అడోబ్‌ సీఈవో భేటీ

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ (Shantanu Narayen) నేడు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో భేటీ అయ్యారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై చ‌ర్చించారు. గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించారు. తెలంగాణను మానుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

ఎకానమీపై ఏఐ రెవెల్యూషన్ ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్థ‌వంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్‌తో చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు అన్ని ర‌కాలుగా స‌హ‌కారం అందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కోరారు.

Read Also: సిద్ధిపేట్‌లో కవిత vs హరీశ్.. సంచలన ఆడియో లీక్..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>